యాప్నగరం

గ్రేటర్ ఎన్నికలు: మంత్రి పువ్వాడ కారుపై దాడి.. ఒకర్ని తీవ్రంగా కొట్టిన నేతలు

Forum Mall Hyderabad: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్నిచోట్ల గొడవలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది.

Samayam Telugu 1 Dec 2020, 1:12 pm
జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో కేపీహెచ్‌బీ ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాల్ వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ టీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.
Samayam Telugu పువ్వాడ అజయ్ (ఫైల్ ఫోటో)
Puvvada ajay


జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్నిచోట్ల గొడవలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు డివిజన్ల వారిగా పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు. వనస్థలిపురం- 15.69%, హస్తినా పురం- 12.23%, కేపీహెచ్‌బీ -17.63, బాలాజీనగర్- 16.27, అల్లాపూర్‌- 22.70, మూసాపేట- 29.16, బాలానగర్‌- 11.67, కూకట్‌పల్లి- 10.61, వివేకానందనగర్-10.57, ఫతేనగర్‌- 17.05, బోయిన్‌పల్లి- 14.06, హైదర్‌నగర్- 13.46, ఆల్విన్ కాలనీ-13.68, నాగోల్ -16.16%, మన్సూరాబాద్ -15.84%, బీఎన్‌ రెడ్డి నగర్- 15.76, హయత్‌నగర్- 14.99 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

GHMC ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.