యాప్నగరం

సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ లేదు :రామ్ మాధవ్

CAA కు అనుకూలంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రామ్ మాధవ్ హాజరయ్యారు. సీఏఏపై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

Samayam Telugu 3 Jan 2020, 3:33 pm
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ భరోసానిచ్చారు. దీనివ్ల దేశంలో అందరికి సమాన ప్రాతినిథ్యం, సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. సీఏఏకు అనుకూలంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రామ్ మాధవ్ హాజరయ్యారు. సీఏఏపై విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
Samayam Telugu Ram Madhav


Also Read: హైదరాబాద్‌లో వర్షాలు.. అరుదైన రికార్డు

‘‘దేశ విభజన సమయంలో పొరుగు దేశాల్లోని హిందువులు దేశంలోకి వచ్చారు. ఇక్కడి ముస్లింలు ఆయా దేశాల్లోకి వెళ్లి స్థిరపడ్డారు. ఆ సమయంలో నెహ్రూ లియాఖత్ ఒప్పందం జరిగాక భారత్ లౌకిక వాద దేశంగా మారింది. అన్ని మతాలు, కులాలకు సమాన ప్రాతినిథ్యం ఇచ్చే దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటికీ, ఎప్పటికీ భారత్ అదే సూత్రాలపై నడుస్తుంది. రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వం ఎప్పటికీ భారత్‌లో చెరిగిపోదు. భారత్‌లో ఇస్లాం మతంలోని 72 తెగలు ఒక్క భారత దేశంలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ముస్లిం దేశంలోనూ ఇన్ని తెగలవారు లేరు. భారత్‌లో మతం పట్ల వివక్ష చూపుతున్నారనే ప్రచారం విచారకరం.’’

Also Read: శుభవార్త..! ఉల్లి ధరలు తగ్గుముఖం, ప్రస్తుతం ఎంతంటే..

‘‘పాకిస్థాన్‌ సెక్యులరిజం లేదు. 1956లోనే తనని తాను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా పాక్ ప్రకటించుకుంది. ఒక మత రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ పరిస్థితి ఆ దేశంలోని ప్రజలకే నచ్చలేదు. 1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా మారిపోవడం కూడా భాష, బెంగాలీ గుర్తింపు కోసం జరిగింది. ప్రస్తుతం 44 లక్షల మంది ఇతర దేశాల ప్రజలు భారత దేశంలో ఉంటున్నారు.’’ అని రామ్ మాధవ్ ప్రసంగించారు.

Also Read: బీటెక్ కోర్సుల్లోకి కొత్త సబ్జెక్టు.. వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్
Also Read: Hyderabad Police: భారీ తెరలు, ఆడియో హెచ్చరికలతో వినూత్న ప్రచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.