యాప్నగరం

కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు, మజ్లిస్ మాత్రమే ప్రత్యేకమా?

Kanhaiya Kumar‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో సీపీఐ తలపెట్టిన మీటింగ్‌కు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు మజ్లిస్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Samayam Telugu 13 Jan 2020, 4:51 pm
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌లను నిరసిస్తూ.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ సభకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సభను రద్దయ్యింది. మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ సభను నిర్వహించాలని భావించారు. కానీ చివరి నిమిషంలో హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్టీ నేతలతో ఈ విషయం చెప్పని పోలీసులు.. ఎలాంటి అరేంజ్‌మెంట్స చేయొద్దని ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి చెప్పడం గమనార్హం.
Samayam Telugu kanhaiya kumar


మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్ణయం పట్ల హైకోర్టును ఆశ్రయిస్తామని సీపీఐ హైదరాబాద్ విభాగం కార్యదర్శి ఈటీ నరసింహ తెలిపారు. ఈ సభలో కన్హయ్య కుమార్‌తోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా కూడా ప్రసంగించాల్సి ఉంది.

పోలీసు అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అజీజ్ పాషా ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని.. శాంతియుతంగా నిర్వహించే సభలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి కొన్ని వర్గాలకు అనుమతి ఇవ్వడం పట్ల సీపీఐ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనూ వామపక్షాల నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు.

సీఏఏకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ మిత్రపక్షం కాబట్టి మజ్లిస్‌కు మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 10న భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించిన మజ్లిస్.. జనవరి 25న, జనవరి 30న నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.