యాప్నగరం

అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం.. రంగంలోకి నిఘా వర్గాలు

Amit Shah Convoy: ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు.. మరోవైపు రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలతో హైదరాబాద్ కోలాహలంగా మారింది. విమోచన దినోత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాగా.. వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు హై అలర్ట్‌గా ఉండాలి. ఎంత అలర్ట్‌గా ఉన్నా.. చివరికి కేంద్ర హోం మంత్రి విషయంలోనే భద్రతా వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్‌కి ఓ కారు అడ్డుగా రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 17 Sep 2022, 2:03 pm
Amit Shah Convoy: తెలంగాణ విమోచన దినోత్సవాల్లో (Telangana Liberation Day) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah Hyderabad Tour) టూర్‌లో భద్రతా వైఫల్యం (Security failure) కొట్టొచ్చినట్టు కనిపించింది. పరేడ్‌గ్రౌండ్స్‌ (Parede Grounds) లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ నేతలతో భేటీ నేపథ్యంలో హరిత ప్లాజా (Haritha Plaza) కు పయణమయ్యారు. ఈ క్రమంలో.. ఓ గుర్తుతెలియని కారు హరిత ప్లాజా ఎంట్రెన్స్‌లో అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చింది. కారు రోడ్డు మీదే ఆగిపోవటంతో.. అమిత్ షా భద్రతా సిబ్బంది కారు అద్దాలను పగలగొట్టారు. వెంటనే కారును పక్కకు తొలగించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కాన్వాయ్ 5 నిమిషాల పాటు రోడ్డు మీదే నిలిచిపోవాల్సి వచ్చింది.

అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన కారు

Samayam Telugu amith shah convoy.
అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన కారు

ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ అధికారులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డు వచ్చిన కారు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి కాన్వాయ్‌కు కారు అడ్డురావటంపై ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కారు ఎందుకు అడ్డుగా వచ్చింది..? ఎక్కడి నుంచి వచ్చింది..? కారులో ఉన్న వ్యక్తి ఎవరు..? అన్న అంశాలపై ఆరా తీశారు. కాన్వాయ్‌కు అడ్డువచ్చిన రెడ్ కలర్ కారు.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌దిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఏం జరిగిందన్న అంశాలపై ఆరా తీసే పనిలో పడ్డాయి.

మరోవైపు.. ఆ కారు టీఆర్‌ఎస్ నేతలదేనని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కారులో టీఆర్ఎస్ కండువా కూడా ఉందని చెబుతున్నారు. వివరాలు అడిగితే చెప్పకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి విషయంలో ఇలా జరగటంతో భద్రతాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కారు డ్రైవర్ మాత్రం.. టెన్షన్‌లో అలా జరిగిపోయిందని వాపోతున్నాడు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.