యాప్నగరం

చెరువులో పడ్డ కారు.. ముగ్గురు జల సమాధి

Yadadri Bhuvanagiri: వీరంతా సమీప గ్రామానికి శుక్రవారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లుగా గుర్తించారు.

Samayam Telugu 22 Feb 2020, 2:33 pm
యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంకి చెరువులో ఓ కారు లభ్యమైంది. ఈ కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. చనిపోయిన వారిని సర్నేనిగూడెం సర్పంచ్ రాణి కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. కారులో సర్పంచ్ రాణి భర్త మధు, కుమారుడు మత్య్సగిరి, మధు స్నేహితుడు సాగుబావిగూడానికి చెందిన శ్రీధర్‌ రెడ్డి ఉన్నారు. నిన్న స్నానం చేసేందుకు మధు, మత్స్యగిరి రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి బయటకు వెళ్లారు. అనుమానంతో పోలీసులు, బంధువులు ఎల్లంకి చెరువులో గాలింపు చేపట్టగా కారు లభ్యమైంది. ఇందులోనే మృతదేహాలు కూడా దొరికాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Samayam Telugu Capture2


వీరంతా సమీప గ్రామానికి శుక్రవారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లుగా గుర్తించారు. బయటకు రాలేక కారులోనే అందరూ అందులోనే ప్రాణాలు విడిచినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులు శుక్రవారం ఎంతకీ ఇంటికి రాకపోవడంతో సర్పించ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: శివ లింగానికి రోజూ అభిషేకం చేస్తున్న పాములు

విచారణలో భాగంగా పోలీసులు ఎల్లంకి గ్రామంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కారు చెరువుకట్టపైకి వెళ్లినట్లుగా గుర్తించారు. శనివారం చెరువును గాలించి, కారును బయటకు తీశారు. ప్రమాదవశాత్తు మాత్రమే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: ట్రంప్ భారత పర్యటన.. చిలుకూరు బాలాజీకి పెద్ద ఎత్తున పూజలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.