యాప్నగరం

Disha Case: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు.. పవిత్రమైన పేరును తప్పుగా వాడారని..

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని మహ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా కేసు గురించి రాజాసింగ్ సామాజిక మాధ్యమాల్లో స్పందించేటప్పుడు ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘మహ్మద్’ అనే పేరును ఆయన అమర్యాదకరంగా వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Samayam Telugu 4 Dec 2019, 7:37 pm
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి పేరు ప్రస్తావిస్తూ ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన స్పందించారని మహ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu raja


దిశా కేసు గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించేటప్పుడు ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘మహ్మద్’ అనే పేరును రాజాసింగ్ అమర్యాదకరంగా వాడారని నవాజుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యానించడం తగదని, తమ ప్రవక్త పేరును అవమానపరుస్తూ పోస్ట్ చేయడాన్ని ముస్లిం సమాజం ఏ మాత్రం సహించబోదని తెలిపారు. తక్షణం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Cable bridge: హైదరాబాద్ తీగల వంతెన నిర్మాణంలో కీలక ఘట్టం.. ప్రత్యేకతలివే!
మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘దిశాకు యావత్ ప్రపంచం మద్దతు పలుకుతోంది. కానీ, పాత బస్తీలో కొంత మంది మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దిశాను కిరాతకంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఒకరైన మహ్మద్ అనే వ్యక్తి పేరును మర్యాదగా పలకాలని ఓ వ్యక్తి డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నరహంతకుడైన నిందితుడికి ఉరి శిక్ష పడాలని అంతా కోరుకుంటుంటే.. వాడి పేరు నేను మర్యాదగా ఉపయోగించాలా? అసలు ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయగానే ఎస్సై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? ఆ నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడాల్సిందే. దిశ మరణించినట్లుగానే వారు కూడా చనిపోవాలి.’’ అని ధ్వజమెత్తారు.


Also Read: దిశ కేసులో కీలక అడుగు.. మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.