యాప్నగరం

ఎంపీలు, ఎమ్మెల్యేలకు TS హైకోర్టు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు

TS High Court: నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాన్ని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించింది.

Samayam Telugu 3 Oct 2020, 6:30 pm
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించి రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శనివారం హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానాలకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు తాజా ఆదేశాలతో తమపై కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులకు మింగుడు పడని అంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొనే వివరాల ప్రకారం అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ సహా ఇతర కేసులు ఉన్న సంగతి తెలిసిందే.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana-high-court


అంతేకాక, నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాన్ని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించింది. జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: undefined

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.