యాప్నగరం

కేసీఆర్‌కు కేంద్రం బహుమతి.. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాతి రోజే..

TRS: స్థలానికి గజం రూ.50 వేల చొప్పున మొత్తం రూ.5 కోట్లు ఖర్చయినట్లు టీఆర్ఎస్ లీడర్లు గతంలోనే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉందని అప్పట్లో అన్నారు.

Samayam Telugu 4 Nov 2020, 5:47 pm
ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ భవన్‌ను నిర్మించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో కీలక ముందడుగు పడింది. ఢిల్లీ వసంత్ విహార్‌లో టీఆర్ఎస్‌కు 1,100 చదరపు మీటర్ల భూమిని కేంద్రం అప్పగించింది. ఈ భూమికి సంబంధించిన పత్రాలను టీఆర్ఎస్ తరపున మంత్రి వేముల ప్రశాంత్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ తరహాలో ఢిల్లీలోనూ పార్టీ ఆఫీసు నిర్మించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పారు.
Samayam Telugu కేసీఆర్‌కు కేంద్రం బహుమతి
trs


ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి కేంద్రం నుంచి గత ఆగస్టులోనే గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని కోసం కేంద్రం వసంత్ విహార్ ఏరియాలో 1100 గజాల స్థలం కేటాయించింది. స్థలానికి గజం రూ.50 వేల చొప్పున మొత్తం రూ.5 కోట్లు ఖర్చయినట్లు టీఆర్ఎస్ లీడర్లు గతంలోనే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉందని అప్పట్లో అన్నారు. ఆయన పరిశీలన అనంతరం పార్టీ కార్యాలయం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారని కూడా అన్నారు. కానీ, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి స్థలాన్ని పరిశీలించలేదు. తాజాగా స్థలానికి సంబంధించి పత్రాలను కేంద్రం అందించడంతో ఇకపై పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు మొదలవుతాయని తెలుస్తోంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.