యాప్నగరం

‘ఈటల ముఖం అసెంబ్లీలో చూడొద్దనే ఇదంతా.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తేయాల్సిందే’

TS Budget Session: తెలంగాణ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదన్నారు.

Samayam Telugu 8 Mar 2022, 10:02 am
తెలంగాణ బడ్జెట్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్‌ను ఇలా అవమాన పరచలేదన్నారు.. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడుతనమేనని ధ్వజమెత్తారు.
Samayam Telugu ఈటల రాజేందర్, కేసీఆర్


‘గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేయడం సబబేనా.. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ఆందోళనలు చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేదు..’ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా ఏనాడు అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్రారంభించ‌లేద‌ని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం దారి త‌ప్పిన‌ప్పుడు ప్రశ్నించే అధికారం ఎమ్మెల్యేల‌కు ఉంటుంద‌న్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే బీజేపీ ఎమ్మెల్యేల‌ను సస్పెండ్ చేశార‌ని ఆరోపించారు.

ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడకూడదంటూ కేసీఆర్ గతంలో చేసిన ప్రతిజ్ఞను నిలుపుకునేందుకే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. సభలో ఈటలను చూడాల్సి వస్తుందనే సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.. ప్రగతిభవన్‌లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారమే ఇదంతా జరిగిందన్నారు.. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు ప్రశ్నించే అధికారం సభ్యులకు ఉంటుందని గుర్తు చేశారు.. బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన స‌స్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.