యాప్నగరం

తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులపై.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీటీడీపీ నేతలతో ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలకు టీడీపీ సిద్ధం కావాలన్నారు.

Samayam Telugu 8 Nov 2020, 7:17 am
తెెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అమెజాన్ వెబ్ సర్వీసస్ దాదాపు 20వేల 700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ దూర దృష్టి వల్లే అమెజాన్ వంటి సంస్థలు ఇవాళ హైదరాబాద్ వస్తున్నాయన్నారు చంద్రబాబు. గ్రేటర్‌ హైదరాబాద్ టీడీపీ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో టీడీపీ పాత్రను వివరిస్తూ గ్రేటర్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు
chandrababu naidu


ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు టీడీపీకి ఉంటుందని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన సైబరాబాద్‌ నిర్మాణం, తదితర అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డివిజన్‌, బూత్‌కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్వరలో నియోజకవర్గ ఇన్‌చార్జిల నియామకం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని పార్టీశ్రేణులకు చంద్రబాబు సూచించారు.

Read More: జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా విడుదల.. 11వరకు అభ్యంతరాల స్వీకరణ

వర్షాలతో నష్టపోయిన పేదలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోరాడాలన్నారు. డివిజన్ల వారీగా పట్టున్న నాయకులను ఆహ్వానించి ఎన్నికలకు ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పార్టీ నాయకులతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.