యాప్నగరం

Tomato Rate: సామాన్యులకు చుక్కలు.. భారీగా పెరిగిన టమాటా, చికెన్ ధరలు!

Chicken Rate: నిత్యావసరాల రేట్లు మండిపోతున్నాయి. ముఖ్యంగా నిన్నామొన్నటి వరకు రూ.300 లోపున్న కేజీ చికెన్ ధర 300 దాటగా, ఇక టమాటా ధర కూడా చుక్కలనంటుతోంది. ఏరియాను బట్టి కిలో రూ.80 నుంచి 100 వరకు పలుకుతోంది.

Authored byRaj Kumar | Samayam Telugu 16 May 2022, 9:47 am
కూర ఏదైనా సరే రుచి కోసం ఒకటో రెండో టమాటాలు వాడుతుంటారు సామాన్యులు.. ఇటు వీకెండ్ వచ్చిందంటే చాలు చికెన్ షాపునకు పరుగులు పెడుతుంటారు. అయితే కొద్దిరోజులుగా వీటి ధరలు ఎక్కువగా పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో టమాటా, చికెన్ ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో వీటిని సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఏరియాని బట్టి బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో టమాటా రూ.80 నుంచి 100 వరకు పలుకుతుండగా.. చికెన్ అయితే ఏకంగా రూ.300 దాటింది. కేజీ చికెన్‌ రూ.310 నుంచి రూ. 320 వరకు పలుకుతోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఎండల ప్రభావం ఈ రెండింటిపై పడింది. తెలంగాణలో ఈసారి టమాటా సాగు భారీగా తగ్గింది.. ఇటు కోళ్ల ఫారాల సంఖ్య సగానికి తగ్గిపోయింది. దీంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, కోళ్ల పెంపకం తగ్గడం వల్లే షార్టేజ్‌ ఏర్పడి ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

బండి సంజయ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఇయ్యనీకి అది తంబాకో.. లవంగమో కాదు: కేటీఆర్
మరోవైపు ఇక్కడ టమాటా సాగు తగ్గడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కనిపిస్తోంది. అంటే నెలాఖరు వరకు వంటింట్లో టమాటా కన్పించక పోవచ్చనిపిస్తోంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.