యాప్నగరం

తెలంగాణ: 40 సబ్‌స్టేషన్లను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు

సరిహద్దుల్లో కాలు దువ్విన చైనా.. భారత్‌లో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌పై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు.

Samayam Telugu 3 Mar 2021, 8:42 am
ఇన్నాళ్లూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. భారత్‌పై సైబర్ దాడులకు సైతం ప్రయత్నిస్తోంది. భారత్‌లో విద్యుత్ సరఫరాను కుప్పకూల్చేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. తెలంగాణలోనూ విద్యుత్ సర్వర్లను హ్యాక్ చేసేందుకు చైనా యత్నించింది. మన సర్వర్లలోకి చైనాకు చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి.. విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
Samayam Telugu power grid
A file image of a power grid


సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి 40 సబ్‌స్టేషన్లలోకి చైనీస్ మాల్‌‌వేర్ ప్రవేశించిందనే విషయమై తమకు అలర్ట్‌లు అందాయని సీఎండీ తెలిపారు. తెలంగాణ ఎస్ఎల్‌డీసీపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించిన విషయాన్ని పసిగట్టిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ విద్యుత్ రంగ సంస్థలకు సూచించింది.

దీంతో అప్రమత్తమైన రాష్ట్ర విద్యుత్ సాంకేతిక విభాగం.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని ప్రభాకర్ రావు తెలిపారు. గ్రిడ్‌కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామన్నారు.

గల్వాన్ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత.. అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విద్యుత్ సంక్షోభానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన అధ్యయనంలో తేల్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.