యాప్నగరం

నీలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్.. త్రిసభ్య కమిటీ విచారణ

నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం నిలోఫర్‌లో విచారణ జరిపింది.

Samayam Telugu 30 Sep 2019, 2:51 pm
నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం నీలోఫర్ ఆసుపత్రిలో పర్యటించింది. ఎంత మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారన్న కోణంలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.
Samayam Telugu niloufar


నీలోఫర్ హాస్పిటల్ త్రిసభ్య కమిటీ విచారణ..
డాక్టర్ రాజారావ్, డాక్టర్ నిర్మల థామస్, డాక్టర్ లక్ష్మీ కామేశ్వరితోపాటు నిలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ మురళీ కృష్ణ విచారణలో పాల్గొన్నారు. ఫిర్యాదు చేసిన డాక్టర్ లాలూ ప్రసాద్, ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ కూడా విచారణలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.

ఎంత మంది మీద క్లినికల్ ట్రయల్స్‌ చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ జరిపిన కమిటీ వివరాలు సేకరించింది. తాము సేకరించిన పూర్తి వివరాలు ప్రభుతానికి అందజేస్తామని కమిటీ స్పష్టం చేసింది. క్లినికిల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఫార్మా కంపెనీల వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.