యాప్నగరం

CM KCR National Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి దేశవ్యాప్త పర్యటన

Kcr Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నమే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వివిధ రాజకీయ పార్టీలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 20 May 2022, 8:43 am

ప్రధానాంశాలు:

  • సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన
  • ముందుగా నేడు మధ్యాహ్నం ఢిల్లీకి..
  • అక్కడ వివిధ పార్టీలు, జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కేసీఆర్ (ఫైల్)
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. దాని కోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. దేశ రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వారితో చర్చించనున్నారు. అలాగే జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతోనూ ఆయన భేటీ కానున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ఆయన కలవబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఢిల్లీ నుంచి 22న మధ్యాహ్నం సీఎం పంజాబ్‌కు బయల్దేరతారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సాయం అందజేయనున్నారు. 600 రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందిస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అలాగే 26న ఉదయం ఆయన బెంగళూరుకు బయల్దేరతారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశమవ్వనున్నారు. అక్కడి నుంచి 27న మహారాష్ట్రలోని రాలెగావ్‌సిద్ధికి వెళ్లనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో సమావేశమవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం షిర్డీకి వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం 29 లేదా 30న పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ పర్యటనకు సిద్ధం కానున్నారు. అలాగే గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఈ సందర్భంగా ఆయన పరామర్శిస్తారు. ఇంతకుముందు ప్రకటించినట్లు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.

TRS లో కుదుపు.. కారు దిగి కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే దంపతులు.. కారణమదేనా?
మరోవైపు అప్పులకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి, కేంద్రం మన స్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ను కలవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఢిల్లీకి వెళ్లారు. సీఎం ఆదేశాలతో గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. సోమనాథన్‌ను కలిసే యత్నంలో ఉన్నారు. కాగా ఈ పర్యటనలో కేంద్రం రుణాలకు అనుమతి ఇవ్వకపోతే జూన్‌ నెల ఉద్యోగుల వేతనాల చెల్లింపులపై ప్రభావం పడే అవకాశమున్నట్లు సమాచారం.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.