యాప్నగరం

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం

కేసీఆర్ అనుమతితో ఓ హోటల్‌లో నిరాడంబరంగా దత్తపుత్రిక నిశ్చితార్థం జరిగింది. రాంనగర్‌కు చెందిన ఓ యవకుడితో ప్రత్యూష నిశ్చితార్థం నిర్వహించారు.

Samayam Telugu 19 Oct 2020, 8:09 am
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ఓ ఇంటిది కాబోతోంది. తాజాగా ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. పిన్నతల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురైన ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యూషను సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది. అయితే ప్రత్యూష తాజాగా
Samayam Telugu ఆస్పత్రిలో ప్రత్యూష (ఫైల్ ఫోటో)
cm kcr adopted girl

నిశ్చితార్థం చేసుకుంది. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.

ఐదేళ్లలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎదిగిన ప్రత్యూష.. తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతున్నారు. ఆదివారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ప్రత్యూషను కలిసి విషయం చెప్పాడు. దీంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది.
ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు.

Read More: కేటీఆర్‌‌కు హైస్కూల్ టీచర్ ట్వీట్... వెంటనే స్పందించిన మంత్రి

వారు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లమని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్యను ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్‌ వేడుకను పర్యవేక్షించారు. ప్రస్తుతం నర్సింగ్ ను పూర్తిచేసిన ప్రత్యూష ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. తన వివాహానికి కచ్చితంగా వస్తానని కేసీఆర్‌ చెప్పారని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.