యాప్నగరం

కేసీఆర్ మరో నిర్ణయం.. హరీశ్, కేటీఆర్‌లకు కీలక బాధ్యతలు

Telangana అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న శాఖలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.

Samayam Telugu 11 Sep 2019, 7:00 pm
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే కేబినెట్ విస్తరించిన విషయం తెలిసిందే. కేటీఆర్, హరీశ్ రావులను మంత్రి వర్గంలోకి తీసుకున్న ఆయన కీలక శాఖలైన మున్సిపల్, ఆర్థికంతోపాటు మరికొన్ని శాఖలను వారికి కేటాయించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీశ్ రావు, కేటీఆర్‌‌లతోపాటు మంత్రులకు మరో ముఖ్య బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. సమావేశాల్లో తన దగ్గరున్న శాఖలపై విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతలను కట్టబెట్టారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu KTR-KCR-Harish-rao


కీలకమైన సాగునీటి పారుదల వ్యవహారాలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు కట్టబెట్టారు. దీనితోపాటు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బాధ్యతలను కూడా హరీశ్ రావుకే అప్పగించారు.

గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు సంబంధించిన బాధ్యతలను కేటీఆర్‌కు, రెవెన్యూ శాఖకు సంబంధించిన బాధ్యతను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పజెప్పారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కమర్షియల్ టాక్స్ శాఖలను కేటాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.