యాప్నగరం

శ్రీశైలం మృతులకు కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. చాలదంటూ ఉద్యోగుల ఆందోళన

KCR: జల విద్యుత్‌ ఉత్పత్తి​కేంద్రం అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా కల్పించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Samayam Telugu 21 Aug 2020, 8:27 pm
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Srisailam Power Plant


Must Read: undefined

జల విద్యుత్‌ ఉత్పత్తికేంద్రం అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా కల్పించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్లాంట్‌లో ఏ మేరకు నష్టం జరిగిందనేది ఇప్పుడే అంచనా వేయలేమని మంత్రి వెల్లడించారు.

Also Read: undefined

మాకేం సరిపోదు..
అయితే, ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారం తమకు ఏమాత్రం సరిపోదని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు శ్రీశైలంలోని జెన్ కో ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. సీఎం కనీసం మృతుల కుటుంబాలను కూడా పరామర్శించలేదని మండిపడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో జెన్‌కో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.