యాప్నగరం

కోట్లాది నష్టం.. ఉద్యోగుల జీతాలు కష్టమే!

Coronavirus Lockdown నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలివ్వడమే కష్టంగా మారిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తెలిపారు.

Samayam Telugu 30 Mar 2020, 1:44 am
రోనా వైరస్ కారణంగా ఆర్థికంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిందని పేర్కొన్నారు. గత వారం రోజుల్లో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో స్థిరాస్తి రంగం తదితర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ఆబ్కారీ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం సమకూరేదని కరోనా వైరస్ కారణంగా పరిస్థితి చిన్నాభిన్నమైందని కేసీఆర్ వివరించారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే సమస్యగా ఉందన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితిపై ఆదివారం (మార్చి 29) మీడియా సమావేశంలో పత్రికా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈవిధంగా పేర్కొన్నారు.
Samayam Telugu kcr


‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల జీతాల్లో కోత విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటివి తప్పదు. ప్రజల ప్రాణాలు పోతుంటే.. ఇలాంటివి పట్టించుకుంటామా. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ రానంతగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, అయినప్పటికీ అప్పు తెచ్చయినా రైతుల పంటను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుల కోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌కు సుమారు రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

Also Read: కరోనా విషయంలో భారత్ తెలివిగా చేసింది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.