యాప్నగరం

అవసరమొస్తే దేవుడితోనూ కొట్లాడతాం.. సీఎం కేసీఆర్

Pragathi Bhavan: అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు గురువారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 2 Oct 2020, 7:43 am
తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునేందుకు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. జల వివాదంపై ఈ నెల 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ నుంచి బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సూచించారు. ఈ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు గురువారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండగ వాతావరణం నెలకొందని, పంట దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని కొనియాడారు.
Samayam Telugu కేసీఆర్
kcr


సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాలను ఒడిసి పట్టుకొని తెలంగాణలో బీడు భూములను పచ్చగా మార్చుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నదీ జలాలపై జరిగే సమావేశంలో మనం బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఎజెండాలోని అంశాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంశాలవారీగా సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంఓ అధికారులు, నీటిపారుదల రంగ సలహాదారు ఎస్‌.కె.జోషి, ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, నాగేందర్‌రావు, హరిరాం తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.