యాప్నగరం

ఉద్యోగుల ప్రమోషన్లు, జీతాల పెంపుపై సీఎం సమీక్ష.. కీలక నిర్ణయాలు

Pragathi Bhavan: మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 24 Jan 2021, 10:21 pm
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Samayam Telugu KCR
kcr


మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎస్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదోన్నతులకు సంబంధించి కూడా అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగుల పీఆర్‌సి , ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వారం పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం వేతన సవరణ సంఘం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన ఆయన.. సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు.

ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశించారు. ఉద్యోగులతో చర్చల అనంతరం ఆ త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగా ఉద్యోగుల జీతాల పెంపు, ప్రమోషన్‌లపై తుది నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.