యాప్నగరం

పంచాయతీ కార్మికులకు కేసీఆర్ దీపావళి కానుక.. వేతనాల పెంపు

Panchayat Workers: గ్రామ పంచాయతీల్లో కార్మికుల వేతనాలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 14 Oct 2019, 10:05 pm
గ్రామ పంచాయతీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కార్మికుల వేతనాలను నెలకు రూ.8,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సోమవారం (అక్టోబర్ 14) రాత్రి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు ఒక్కో గ్రామంలో ఒక్కోలా వేతనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu sanitation


పెంచిన జీతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జీతాలు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లో దీపావళి ముందే వచ్చింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆర్టీసీ సమ్మెపై స్పందించిన చంద్రబాబు

మరోవైపు.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చగా.. ఆర్టీసీ కార్మికుల విషయాన్ని వదిలేసి, ఇతర శాఖల ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యల నేపథ్యంలో చర్చలకు సిద్ధమని ఎంపీ కేశవరావు ద్వారా సంకేతాలు పంపిన సీఎం.. తమ విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.