యాప్నగరం

గవర్నర్‌‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 2 Jun 2020, 1:47 pm
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న ఆమె పుట్టిన రోజు కూడా కావడంతో... గవర్నర్‌కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తన జన్మదినం ఒకే రోజు కావడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు తెలంగాణ ప్రజలకు గవర్నర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu cm kcr meets governor tamilisai soundararajan at raj bhavan
గవర్నర్‌‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్


భారత దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గవర్నర్ కొనియాడారు. ఈ ఆరేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో వృద్ధి సాధించిందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాలతో, సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా మారి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.

కరోనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారని తమిళిసై కితాబిచ్చారు. తెలంగాణను సంపన్నమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనం విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాన’’ని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.