యాప్నగరం

KCR: సొంతపార్టీ ఎమ్మెల్యేపై సీఎం పొగడ్తలు.. ప్లీనరీలో ఆసక్తికర ఘటన

దేశాన్ని తట్టిలేపే ఉద్యమం దళిత బంధు. తరతరాలుగా వివక్షకు గురైన జాతికి సాంత్వన అది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పని ఎప్పుడో చేశారు. సొంత గ్రామంలో 10 ఎకరాల భూమిని దళితులకు పంచిపెట్టారని సీఎం కేసీఆర్ అన్నారు.

Samayam Telugu 25 Oct 2021, 5:51 pm
గులాబీ జెండా ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడచిన సందర్భంగా హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో దళిత బంధుని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు, నిరాదరణకు గురైన దళిత వర్గాలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన మహాద్భుత పథకమని కేసీఆర్ కొనియాడారు. దళిత బంధు అంటే కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదని సీఎం అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


దళితుల బాగు కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే దళితుల కోసం పనిచేశారన్నారు. ఆయన సొంత గ్రామంలో పదెకరాల భూమిని ఆరుగురు దళితులకు పంచిపెట్టారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.50 లక్షలు ఉంటుందంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సీఎం ప్రశంసించారు.

దేశం యావత్తూ తెలంగాణ వైపు చూసే పథకం దళిత బంధు అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. భారత దేశాన్ని తట్టిలేపే ఉద్యమం దళిత బంధు అని ఆయన అన్నారు. తరతరాలుగా సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటు, అవకాశాల లేమితో కొట్టుమిట్టాడుతున్న జాతికి దళిత బంధు పథకం సాంత్వన, ఊరట అందిస్తుందన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.