యాప్నగరం

అలాంటి తెలంగాణ విద్యాసాగర్ రావుకు ఘన నివాళి: కేసీఆర్

Telangana Irrigation: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే విద్యాసాగర్‌ రావుకు నిజమైన నివాళి అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంజినీర్లు విద్యాసాగర్‌రావు ఇచ్చిన స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారని సీఎం కొనియాడారు.

Samayam Telugu 29 Apr 2020, 5:59 pm
సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు నీటి పారుదల నిపుణుడు దివంగతులైన ఆర్‌.విద్యాసాగర్‌రావు చేసిన కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సాగునీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారని చెప్పారు. తద్వారా ఆయన ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విద్యాసాగర్‌రావు వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ బుధవారం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Samayam Telugu కేసీఆర్


రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే విద్యాసాగర్‌ రావుకు నిజమైన నివాళి అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంజినీర్లు విద్యాసాగర్‌రావు ఇచ్చిన స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారని సీఎం కొనియాడారు. దివంగత విద్యాసాగర్‌రావు ఆశయాల మేరకు సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిందని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నామని ఆయన అన్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.