యాప్నగరం

KCR: తెలంగాణ లాక్‌డౌన్‌ యథాతథం.. వాటికి మాత్రం మినహాయింపు

Telangana Lockdown: ఈ నెల 17తో దేశ వ్యాప్త లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్-4పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు ఇలాగే కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

Samayam Telugu 15 May 2020, 10:29 pm
కరోనా వైరస్, తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష ముగిసింది. వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్ డౌన్ అమలు, తదితర అంశాలపై సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతుండడంపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యథాతథంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 17తో దేశ వ్యాప్త లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్-4పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు ఇలాగే కొనసాగించాలని సీఎం ఆదేశించారు. వానా కాలం రానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)


Also Read: undefined

ఈ క్రమంలో లాక్ డౌన్‌లో స్వల్ప సడలింపులకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఏసీల విక్రయ దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ఆటోమొబైల్ షోరూంలు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలకు కూడా వీలు కల్పించారు.

ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, వైద్య ఆరోగ్య, పురపాలకశాఖల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.