యాప్నగరం

సభలో భట్టిపై సీఎం కేసీఆర్ సీరియస్

భట్టి విక్రమార్కకు ప్రతిసారి ఇది పరిపాటిగా మారిందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర చట్టాలను అసెంబ్లీలో ఓ లిమిట్ వరకే చర్చించుకోవచ్చన్నారు.

Samayam Telugu 17 Mar 2021, 1:32 pm
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడురోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సభలో గవర్నర్ ధన్యవాదాల తీర్మానం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనల గురించి ప్రస్తావించారు. గవర్నర్ తమిళిసై వ్యవసాయ రంగం గురించి గొప్పగా చెప్పారన్నారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు అని భట్టి వ్యాఖ్యానించారు.
Samayam Telugu భట్టిపై  సీఎం సీరియస్


భట్టి ప్రసంగంలో జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్... భట్టి ఉప సభాపతిగా పనిచేశారన్నారు. సభ నిబంధనలు వారికి తెలుసన్నారు. కేంద్ర చట్టాలను ఒక లిమిట్ వరకు మాత్రమే అసెంబ్లీ లో చర్చించుకోగలుగుతామని స్పష్టం చేశారు. రాష్ట్రం వరకు మనం చెప్పాల్సినది సభ నుంచి...బయట నుంచి చెప్పామన్నారు గులాబీ బాస్. కేంద్ర ప్రభుత్వ చట్టాలపై మాట్లాడే పరిధి శాసన సభకు లేదన్నారు. కొంత లిమిట్ వరకు చెప్పవచ్చన్నారు. పార్లమెంట్ లో మీ పార్టీ సభ్యులు ఉన్నారన్నారు. అక్కడ మాట్లాడమని చెప్పండి అని భట్టి పై కేసీఆర్ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.