యాప్నగరం

సీఎం కొండ పోచమ్మ ప్రాజెక్టు ఆకస్మిక తనిఖీలు.. ఎవరికీ చెప్పకుండానే

Kaleshwaram Project: కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంకా మిగిలి ఉన్న పనులు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. స్థానికులను సాగర్‌లో స్నానాలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 12 Jun 2020, 8:54 pm
సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఉన్నట్టుండి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, మీడియాకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమం జరగడం విశేషం. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే పరుగులపై ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సీఎం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సందర్శన సాగింది. ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి జలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
Samayam Telugu కేసీఆర్
kcr kaleshwaram tour2.


Also Read: undefined

ఈ సందర్భంగా కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంకా మిగిలి ఉన్న పనులు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. స్థానికులను సాగర్‌లో స్నానాలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండపోచమ్మ దిగువన ఉన్న రైతులకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సాగర్‌నుంచి మల్లన్న సాగర్‌‌‌కు అనుసంధానించే కాలువ నిర్మాణ పనుల గురించి కేసీఆర్ ఆరా తీశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Must Read: హైదరాబాద్‌లో జుంబా డాన్స్ మోసం.. ఆంటీలు టార్గెట్‌గా హైటెక్ దందాMust Read: డ్రోన్ కేసు: పోలీసులకు రేవంత్ రెడ్డి బిగ్ షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.