యాప్నగరం

కేసీఆర్ కీలక నిర్ణయం... భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు

ఈనెల 8న రైతులు భారత్ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.

Samayam Telugu 6 Dec 2020, 10:26 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.
Samayam Telugu సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
cm kcr


Read More: పీసీసీ చీఫ్ పదవి కావాలని అడిగా.. అందరి మద్దతు ఉంది

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాతటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేకంగా ఉన్న చట్టాల్ని వ్యతిరేకించాలని కేసీఆర్ అన్నారు. రైతులకు మద్దతుగా పార్టీ ఉంటుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.