యాప్నగరం

కారు జోరు.. కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

Telangana Municipal Election ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.

Samayam Telugu 25 Jan 2020, 2:29 pm
మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. అక్కడా, ఇక్కడా అని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ హవా నడుస్తోంది. ఫలితాల సరళి చూస్తుంటే.. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల కంటే టీఆర్‌ఎస్‌కు ఈసారి ఓట్ షేర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
Samayam Telugu KCR4


ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ శనివారం (జనవరి 25) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. అటు టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకుగాను టీఆర్‌ఎస్‌ వందకు పైగా స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లలలో ఇప్పటికే ఆరింటిలో ఆధిక్యంలో ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలా బదులిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.