యాప్నగరం

Yadadri పర్యటనకు సీఎం కేసీఆర్.. సుదర్శన యాగంపై నిర్ణయం!

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. అక్కడ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. మహా సుదర్శన యాగం నిర్వహణకు తగిన ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంది.

Samayam Telugu 16 Dec 2019, 11:17 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం (డిసెంబర్ 17) యాదాద్రిలో పర్యటించనున్నారు. గుట్టలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్, కాటేజీలు, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. మహా సుదర్శన యాగం నిర్వహణకు తగిన ప్రాంతాన్ని గుర్తించనున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం నిర్వహించి ఆలయాన్ని పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu yadadri


మంగళవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్.. తొలుత స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి పనుల పురోగతిని పరిశీలిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.