యాప్నగరం

రేపు యాదాద్రికి కేసీఆర్.. ఆలయ పనుల్ని పర్యవేక్షించనున్న సీఎం

గత ఏడాదిలో యాదాద్రిని సందర్శించిన సీఎం.. ఇప్పుడు మరోసారి గుట్టకు వెళ్తున్నారు. సీఎం రాకతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ఆలయ పనులకు సంబంధించిన నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు.

Samayam Telugu 12 Sep 2020, 12:14 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. సీఎం ఆదివారం యాదాద్రిని దర్శించనున్నారు. శెరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. యాదాద్రి ఆలయన పునర్ నిర్మాణ పనుల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పనుల్ని ఎప్పటికప్పుడు సీఎం పర్యవేక్షిస్తునే ఉన్నారు. అయితే కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆలయ పనులకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
Samayam Telugu యాదాద్రికి సీఎం కేసీఆర్
cm kcr at yadadri


గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ యాదగిరిగుట్టలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్తున్నారు. దేశంలో అద్భుతమైన పర్యాటక పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు త్వరగా త్వరగా పూర్తి చేస్తోంది. రూ. 1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించిన రూ.900 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భగుడి చుట్టూ చేపట్టిన పనులు 90 శాతం పూర్తి అయ్యాయి.

Read More: పొలంలో కాదు ఇంటి నుంచే.. 7వతరగతి విద్యార్థినికి ఎయిర్‌టెల్ ఫ్రీ డీటీహెచ్

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న యాదాద్రి ఆలయ తుది దశ పనులు జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా చేస్తున్నారు. ఘాట్‌ రోడ్డులో మొక్కల పెంపకం పనులు సాగుతున్నాయి. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ గర్భాలయ ముఖద్వార తలుపుల పలకలపై బంగారు తాపడం చేసి దేవతా విగ్రహాలు, పద్మాలు, రాజహంసలను అమర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.