యాప్నగరం

ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

సీఎం పర్యటన నేపథ్యంలో గుట్టలో భద్రత పెంచారు. ముందుగా బాాలాలయంలో స్వామివారికి కేసీఆర్ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న పనుల్ని సమిక్షించనున్నారు.

Samayam Telugu 13 Sep 2020, 7:05 am
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. దీంతో మరోసారి ఆలయంలో జరుగుతున్న పనుల్ని గులాబీ బాస్ పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటివరకు ఆలయంలో జరుగుతున్న పనులకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.
Samayam Telugu యాదాద్రికి సీఎం కేసీఆర్
cm kcr at yadadri


పనులు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు 13సార్లు సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఇక ఇవాళ (ఆదివారం ) ఉదయం యాదాద్రి కొండపైకి చేరుకొని తొలుత బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండపై ప్రధానాలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

Read More: తండ్రి సమాధి వద్ద రెండ్రోజులుగా ఏడుస్తున్న బాలిక.. జగిత్యాలలో కన్నీరు పెట్టించే ఘటన

దీంతో ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిర్ణయానికి ముందుగా కొండపై పరిసరాలు, భక్తులకు మౌలిక సదుపాయాలతో పాటు కొండకింద రహదారుల అభివృద్ధి, వసతి సదుపాయాల కల్పన అంశాలపై సీఎం కేసీఆర్‌ పర్యటనలో దృష్టి సారించే అవకాశాలున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా గత మూడు రోజులుగా యాదాద్రి ఆలయంలో దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈ రోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.