యాప్నగరం

నాయినిని చూసి కేసీఆర్ కన్నీళ్లు.. అపోలో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శ.. వీడియో

Jublee Hills: నాయిని నర్సింహరెడ్డి బంజారాహిల్స్‌ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో తొలుత చేరి చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఆయనకు నెగెటివ్‌ అని వచ్చింది. దీంతో పూర్తిగా కోలుకుంటున్న ఆయనకు మళ్లీ నిమోనియా వచ్చింది.

Samayam Telugu 21 Oct 2020, 7:45 pm
అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఇందుకోసం ఆయన ఫిల్మ్ నగర్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము సమస్య (నిమోనియా) తో బాధపడుతున్న నాయిని నర్సింహరెడ్డి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితం నాయినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.
Samayam Telugu నాయిని కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కేసీఆర్
KCR meets Nayini


దీంతో ఆయన బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో తొలుత చేరి చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఆయనకు నెగెటివ్‌ అని వచ్చింది. దీంతో పూర్తిగా కోలుకుంటున్న ఆయనకు మళ్లీ నిమోనియా వచ్చింది. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే నాయిని నరసింహారెడ్డిని పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.