యాప్నగరం

త్వరలో సీఎం కేసీఆర్ నుంచి బిగ్ గుడ్‌న్యూస్.. మంత్రి వెల్లడి

Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి పాల్గొన్నారు. ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు.

Samayam Telugu 3 Nov 2020, 10:53 pm
ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వారికి సీఎం కేసీఆర్‌ త్వరలోనే శుభవార్త చెబుతారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి మాయదారి కరోనా వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే నిరుద్యోగులకు భృతి అందుతుందని చెప్పారు. మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Samayam Telugu ఎర్రబెల్లి దయాకర్ రావు (ఫైల్ ఫోటో)
Errabelli Dayakar


ఎన్నికలప్పుడే ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను మాత్రం వారు మర్చిపోతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారని మంత్రి గుర్తు చేశారు. యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలో కూడా పంటలను కొనడం లేదని విమర్శించారు. మన రాష్ట్రంలో ప్రతి గింజను ప్రభుత్వం కొంటోందని వివరించారు. ఇకనైనా బీజేపీ నాయకులు అబద్ధాలను మానుకోవాలని ఎర్రబెల్లి హితవు పలికారు.

రాష్ట్రంలో ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు. ప్రతి పక్షాల అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.