యాప్నగరం

Srisailam Fire: 4వ యూనిట్ బుగ్గిపాలు.. పవర్ ప్లాంటును పరిశీలించిన సీఎండీ

Srisailam: దేవులపల్లి ప్రభాకర్‌ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం సందర్శించారు. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు.

Samayam Telugu 26 Aug 2020, 9:51 pm
శ్రీశైలం ఎడగమగట్టు జల విద్యుత్ కేంద్రంలో త్వరలోనే కరెంటు ఉత్పత్తి పున:ప్రారంభిస్తామని తెలంగాణ జెన్‌ కో, ట్రాన్స్‌ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌ రావు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేవులపల్లి ప్రభాకర్‌ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం సందర్శించారు. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు.
Samayam Telugu దేవులపల్లి ప్రభాకర్ రావు (ఫైల్ ఫోటో)
cmd prabhakar rao


శ్రీశైలం ప్రమాద ఘటన గురించి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాద ఘటనలో దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగిందని అన్నారు. పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. 4వ యూనిట్‌లో నష్టం ఎక్కువగా ఉంది. 1, 2, 5 యూనిట్లు బాగున్నాయి. 6వ యూనిట్‌లో పవర్ ప్యానెల్ దెబ్బతిన్నది. 4వ యూనిట్ పూర్తిగా కాలిపోయింది. అందరూ అన్నట్లు రూ.వేల కోట్ల నష్టం ఏం లేదు. ప్రాణ నష్టం జరగడమే చాలా బాధాకరం.’’ అని ప్రభాకర్ రావు అన్నారు.

Also Read: undefined

ప్లాంటులో ప్రమాదం జరిగిన రోజు తన సోదరుడు శ్రీనివాసరావు మరణించాడన్న వార్త తెలిసిన తరువాత కూడా ప్రభాకర్ రావు ప్లాంటు వద్దకు వచ్చారు. తన సొంత అన్న మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రభాకర్ రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడి మరణం పట్ల విచారం, సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.