యాప్నగరం

తెలంగాణలో కరోనా కలకలం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పాజిటివ్

రాష్ట్రంలో కోరనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతుంది. ఈ క్రమంలో పలువురు నాయకులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. నిన్న మైనంపల్లికి, నేడు శ్రీధర్ బాబుకు కరోనా సోకింది.

Samayam Telugu 5 Nov 2020, 9:25 am
తెలంగాణాలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు పలువురు నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వైరస్ బారిన పడి కోలుకున్నారు. తాజాగా తెలంగాణాకు చెందిన మరో ఎమ్మెల్యేకు వైరస్ సోకింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తెలిపారు. తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ప్రకటించారు.
Samayam Telugu కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
congress mla sridhar babu


ఈ మేరకు శ్రీధర్ బాబు ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. 'ప్రియమైన శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం, నేను,నా భద్రతా సిబ్బంది శ్రీనివాస్ COVID-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డాము, మేము ఆరోగ్యంతో బాగానే ఉన్నాము, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాము, నాతో ఈమధ్యలో కలసిన వారు అందరు దయచేసి విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను, అలానే నా శ్రేయోభిలాషులందరు ఆందోళన చెందవద్దని కోరుచున్నాను' అని ఆయన తన ఫేస్ బుక్ లో ప్రకటించారు.

Read More: హైదరాబాద్‌లో ఫ్రీ షాపింగ్.. ఏం కావాలన్నా ఇలా తీసుకెళ్లొచ్చు! కానీ..

నిన్న టీర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావుకు కూడా వైరస్ సోకింది. ఆయనతో పాటు.. భార్య, చిన్న కుమారుడు కూడా పాజిటివ్ అని నిర్ణారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.