యాప్నగరం

ఉమ్మడి ఏపీనే బాగుండేది.. అనవసరంగా విడిపోయాం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana Congress: బలమైన నాయకత్వ లక్షణాలు, సామాజిక వర్గం, కలుపుగోలు తనం ఉన్న వారినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి లక్షణాలున్న నాయకుల్లో తానే మొదటివాడిని చెప్పారు.

Samayam Telugu 15 Mar 2020, 7:45 pm
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి.. రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉంటేనే బాగుండేదనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడినందుకు తాను ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పారు. అసెంబ్లీ విరామంలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైరస్‌తో పోల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రతిపక్షాలను గౌరవించాలనే కనీస జ్ఞానం కేసీఆర్‌కు లేదని విమర్శించారు.
Samayam Telugu komatireddy rajagopal


అలా అయితే మాదారి మాదే..
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఒకవేళ పార్టీ అదిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోకపోతే తమదారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా సీనియర్ నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం తగదని అన్నారు.

Also Read: undefinedఅడిషనల్ కలెక్టర్‌కూ హిజ్రాల తాకిడి.. నానా రాద్ధాంతం చేసి చివరికి..

అలాంటి వారిలో మొదటివాడ్ని నేనే..
తర్వాత సీఎల్పీ కార్యాలయంలో కోమటిరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బలమైన నాయకత్వ లక్షణాలు, సామాజిక వర్గం, కలుపుగోలు తనం ఉన్న వారినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి లక్షణాలున్న నాయకుల్లో తానే మొదటివాడిని చెప్పారు. రేవంత్‌రెడ్డికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కానీ, ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి డ్రోన్‌‌తో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ ఫొటోలు తీయించడం సరికాదన్నారు. దీన్ని సాకుగా చేసి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయించడమూ దారుణమన్నారు. గోపనపల్లి భూముల వ్యవహారం బయటకు తీసినందుకు ఈ జీవో 111తో కేటీఆర్‌ను ఇరికించారనే భావన ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Must Read: ‘ఖబడ్దార్ కేసీఆర్.. ఇక నీకు కౌంట్‌డౌన్ మొదలైంది’ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.