యాప్నగరం

కేసీఆర్‌కు రేవంత్ కొత్త డిమాండ్లు.. అందులో చీకటి కోణం ఉందని వ్యాఖ్య

Lockdown in Telangana: సీఎం రిలీఫ్ ఫండ్‌కు వస్తున్న విరాళాల్లో పారదర్శకత లేదని, వైద్య సామగ్రి కొనుగోలు ఒప్పందాల పేరుతో సేకరిస్తున్న నిధుల్లోనూ చీకటి కోణం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Samayam Telugu 25 Apr 2020, 8:25 pm
తెలంగాణలో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం అవలంబిస్తున్న లాక్‌డౌన్, సెల్ఫ్ క్వారంటైన్ అనేవి శాశ్వత పరిష్కారం కావని, ఇది కేవలం ఉపశమన చర్య మాత్రమే అని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణకొరియా అమలు చేస్తున్న తరహాలో ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు.
Samayam Telugu Revanth Reddy KCR


సీఎం రిలీఫ్ ఫండ్‌కు వస్తున్న విరాళాల్లో పారదర్శకత లేదని, వైద్య సామగ్రి కొనుగోలు ఒప్పందాల పేరుతో సేకరిస్తున్న నిధుల్లోనూ చీకటి కోణం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనాకు ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినవేనని అన్నారు. కరోనా కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది ఏమీలేదని విమర్శించారు.

Also Read: undefined

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున 3 నెలలు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు రూ.22,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక ధనిక రాష్ట్రానికి ఇది సమస్య కాదని అన్నారు. పేదలకు మూడు నెలల విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కోరారు. ఆర్థిక, వైద్య, పాలన నిపుణులతో మూడు కమిటీలు వేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read:కేసీఆర్ ఆయనకు ఏం శాపం పెడతారో.. విజయశాంతి సెటైర్లు

అంతేకాక, కేరళలో అక్కడి సీఎం పినరయి విజయన్ కరోనా నిరోధక చర్యలను ప్రతిపక్ష నేతలతో కలిసి వారి సలహాలు కూడా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో విపక్షాలను ఎందుకు పిలవరని.. తమ నుంచి సలహాలు ఎందుకు తీసుకోరని రేవంత్ ప్రశ్నించారు.

Also Read:కరోనా తర్వాత వచ్చే సంచలన మార్పులేంటి? కేటీఆర్ చెప్పిన 3 అంశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.