యాప్నగరం

తెలంగాణ మరో యూపీగా మారుతోంది.. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Telangana Congress: ఖ‌మ్మం జిల్లాలో మైన‌ర్ బాలిక‌పై రేప్ జరిగితే అందుకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని హోమ్ మంత్రి ఇంటిని సంపత్ ముట్టడించారు. దీంతో పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Samayam Telugu 8 Oct 2020, 5:14 pm
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్‌ కుమార్ విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న నేరాల మాదిరిగా తెలంగాణలో కూడా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ కూడా ఉత్తర్ ప్రదేశ్‌లా మారిపోతుందని విమర్శించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరిగిన ఘటనలు మరింతగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. బుధ‌వారం శాంతి భ‌ద్రత‌ల‌పై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆదర్శంగా ఉన్నాయని అనడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సిగ్గు ఉందా..! అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu సంపత్ కుమార్ (ఫైల్ ఫోటో)
sampath kumar


ఖ‌మ్మం జిల్లాలో మైన‌ర్ బాలిక‌పై రేప్ జరిగితే అందుకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని హోమ్ మంత్రి ఇంటిని సంపత్ ముట్టడించారు. దీంతో పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పైనా సంపత్ మండిపడ్డారు. హోంమంత్రి మహమూద్‌ అలీ వెంటనే రాజీనామా చేయాలని సంపత్‌ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒక్క టీఆర్ఎస్ నేత అయినా పరామర్శించాడా? అని సంపత్ సూటిగా ప్రశ్నించారు. దోషులకు కఠిన శిక్షపడేవరకూ వదలొద్దని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.