యాప్నగరం

ఈటల మంచోడే కానీ.. అదే ఆయన తప్పు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కి మద్దతుగా సీనియర్ నేత వీ హనుమంతరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఈటలను ఉద్దేశించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 22 Oct 2021, 5:44 pm
ఉన్నది ఉన్నట్టు.. ముక్కుసూటిగా మాట్లాడే కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ విచ్చేసిన ఆయన ఈటల సొంత ఇలాకాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల మంచోడేనంటూ వీహెచ్ కితాబిచ్చారు. అయితే ఆయన తప్పు చేశాడని వీహెచ్ అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరడమే ఆయన చేసిన తప్పని ఆయన చెప్పారు. ఈటల బీజేపీని ఎంచుకోవడమే తప్పు అని వీహెచ్ అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
etela


బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వీహెచ్‌ టార్గెట్ చేశారు. ధరలపై కనీస నియంత్రణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలకు బీజేపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలకు పోలిక లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ధరల నియంత్రణకు ఈటల బీజేపీని ఒప్పించగరా అని ఆయన ప్రశ్నించారు. దేశం అంబానీ, అదానీ చేతుల్లోకి వెళ్లిపోయిందని వీహెచ్ విమర్శించారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.