యాప్నగరం

కొడుకు పుట్టాడని స్వీట్లు పంచిన కానిస్టేబుల్.. 10 మంది పోలీసులకు కరోనా!

Chikkadpalli: స్వీట్లు తిన్న 10 మందికి పైగా పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అయితే ఆ కానిస్టేబుల్ తమ్ముడికి కూడా కరోనా సోకిందని అతని కారణంగానే కానిస్టేబుల్‌కు కూడా కోవిడ్ 19 సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 6 Jul 2020, 5:20 pm
కరోనా వైరస్ తెలంగాణలో దావానంలా వ్యాప్తి చెందుతోంది. ఎవరికి వారు తాము పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నామనే నమ్మకంతో ఎప్పటిలాగే తోటి వారితో గడపడం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇలాగే హైదరాబాద్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ చేసిన ఓ పని వల్ల ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. తనకు కొడుకు పుట్టాడనే సంతోషంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఆనందాన్ని మిఠాయిల రూపంలో పంచుకున్నాడు. స్టేషన్‌లోని పోలీసులందరికీ స్వీట్లు పంచాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
TS police representative


ఈ స్వీట్లు తిన్న 10 మందికి పైగా పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అయితే ఆ కానిస్టేబుల్ తమ్ముడికి కూడా కరోనా సోకిందని అతని కారణంగానే కానిస్టేబుల్‌కు కూడా కోవిడ్ 19 సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పోలీసు ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఇంకా స్పందించలేదు. మరోవైపు, హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.