యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: గాంధీ భవన్ మూసివేత

హైదరాబాద్ నగరంలో కరోనా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి ప్రభావంతో గాంధీ భవన్‌ను వారం రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు.

Samayam Telugu 15 Jul 2020, 3:06 pm
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోన్న వేళ.. దాని ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌ను మూసివేశారు. గాంధీ భవన్లో పని చేసి సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నాయకులు వారం రోజులపాటు గాంధీ భవన్‌ను మూసివేయాలని నిర్ణయించారు. గాంధీ భవన్‌లో కరోనా కేసు నమోదైందన్న సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు.
Samayam Telugu gandhi bhavan


కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. గాంధీ భవన్ ట్రెజరర్ గూడురు గూడురు నారాయణ రెడ్డికి కరోనా సోకగా.. సీనియర్ నేత వి. హనుమంత రావుకు కూడా కరోనా సోకింది. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేత నరేందర్ యాదవ్ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రగతి భవన్, రాజ్‌భవన్‌లలోనూ భారీ సంఖ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గవర్నర్‌కు కోవిడ్ నెగటివ్ అని రిపోర్ట్ రాగా.. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి ఈ మధ్య ప్రగతి భవన్‌కు వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.