యాప్నగరం

TS కరోనా బులెటిన్: తెలంగాణలో 4,298 కొత్త కేసులు.. ఒకే రోజు 32 మంది మృతి

Coronavirus in Telangana: శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగా గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 601 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది.

Samayam Telugu 15 May 2021, 8:30 pm
తెలంగాణలో శనివారం 4,298 కొత్త పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. ఒకే రోజు 32 మంది కొవిడ్ రోగులు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 2,928కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6026 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,69,007 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,072 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Corona tests


శనివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగా కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 601 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది. చాలా వరకూ జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య వందల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ముగ్గురు మంత్రులం కలిసి గంట ఏడ్చాం, Harish Rao కూడా.. KCRపై ఈటల సంచలనం
మరోవైపు, తెలంగాణలో ఈరోజు ఒక్కరోజే 64,362 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 4,298 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 1,639 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. పూర్తి హెల్త్ బులెటిన్ కోసం కింది పీడీఎఫ్ క్లిక్ చేయండి.

Media Bulletin - Telugu 15052021

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.