యాప్నగరం

హైదరాబాద్‌లో కరోనా రోగి ఆత్మహత్య.. ప్రైవేటు ఆస్పత్రి భవనం ఎక్కి దూకి..

Srinagar Colony: నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్‌‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చెట్ల మీద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. చికిత్స పొందుతూ చనిపోయాడు.

Samayam Telugu 23 Jul 2020, 4:24 pm
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో కరోనా బాధితుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అదే భవనం పైకెక్కి కిందికి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి నాగేంద్ర భారతీయ వైమానిక దళంలో (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కొద్ది రోజులుగా సెలవుపై ఉన్న ఆయనకు ఇటీవలే కరోనా సోకింది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Dead hand

Must Read: కరోనా మరణాలు: లాజిక్‌తో కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.. సంచలన వీడియో బయటికి..

ఈ క్రమంలోనే గురువారం నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్‌‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పై నుంచి చెట్ల మీద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. అందులోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: undefined

Also Read: బాలాపూర్ గణేష్ ఈసారి ఆరడుగులే.. లడ్డూ వేలంపై కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.