యాప్నగరం

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ప్రైవేట్ హాస్పిటల్‌లో కరోనా చికిత్స.. భార్య వెల్లడి

Janagam: ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ సోకడంతో ఇంట్లోని తామంతా అధికారులు సూచనల మేరకు కరోనా టెస్టులు చేయించుకున్నామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతానికి తామంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామని తెలిపారు.

Samayam Telugu 13 Jun 2020, 2:46 pm
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకడంపై ఆయన భార్య పద్మలతా రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆమె వాట్సప్‌లో ఓ వాయిస్ రికార్డును విడుదల చేశారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఆయన అనుచరులు, స్థానిక పార్టీ కార్యకర్తలు ఆందోళన, అయోమయంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. కరోనా సోకినా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు బయటపడగా ఇటీవల హైదరాబాద్ వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారని ఆయన భార్య తెలిపారు. ఈ పరీక్షల్లోనే పాజిటివ్‌గా తేలిందని చెప్పారు.
Samayam Telugu ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (ఫైల్ ఫోటో)
muthireddy


ప్రస్తుతం ఎమ్మెల్యే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. మరో వారం రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు.

ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ సోకడంతో ఇంట్లోని తామంతా అధికారులు సూచనల మేరకు కరోనా టెస్టులు చేయించుకున్నామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతానికి తామంతా ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆరా తీస్తున్న కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌గా తేలిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కావడం గమనార్హం. ఇటుు మంత్రి హరీశ్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలడంతో వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.