యాప్నగరం

కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో నెలలో..

Coronavirus Telangana: ఆగస్టు నెలఖారుకల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 8 Aug 2020, 4:20 pm
కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే కబురు వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ సెప్టెంబర్‌ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు నెలఖారుకల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
Samayam Telugu జి.శ్రీనివాసరావు
telangana Public health director


జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు వైద్య కళాశాలల అనుబంధ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీ) కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా చికిత్సలో భాగంగా విలువైన ఇంజెక్షన్లను జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

Also Read: undefined

దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ కనెక్షన్ ఉన్న పడకలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అంతేకాక, మరో 18 వేల పడకల వరకూ ఆక్సిజన్‌ అందుబాటులోకి రాబోతుందని వివరించారు. ఇందుకోసం టెండర్లు సైతం పిలిచామని వివరించారు. ఎవరికైనా సరే కరోనా నిర్ధారణ అయ్యాక వారు తప్పనిసరిగా చికిత్సా విధానం కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ సూచించారు. కరోనా రోగుల్లో అందరికీ ఒకే రకంగా మందులు ఇవ్వడం కూడా సరికాదని, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు సిఫార్సు చేస్తారని స్పష్టం చేశారు.

కరోనా పాజిటివ్‌ వస్తే ప్రభుత్వం తరపున 14 రోజులకు మందుల కిట్‌ అందజేస్తున్నట్లు తెలిపారు. సరైన సమయంలో వైద్యులు సూచించిన ఈ మందులు వాడితే కరోనా తగ్గిపోతుందని వివరించారు. ఇంటి వద్ద ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారికి కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని జి.శ్రీనివాసరావు వెల్లడించారు.

Also Read: undefined

మరోవైపు, కరోనా సోకి విషమంగా ఉన్న కేసుల్లో రోగి వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆక్సీజన్ అందించినా, ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం లేదని తెలిపారు. ప్లాస్మా దాతల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటేనే ఉపయోగం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు పెరిగిందని, మరణాల శాతం కూడా తగ్గిందని అన్నారు. ప్రభుత్వ నివారణ చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Don't Miss: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.