యాప్నగరం

వనపర్తి: ఫించన్లు ఇచ్చే వ్యక్తికి కరోనా.. డబ్బు తీసుకున్న 54 మందికీ వైరస్

Wanaparthy: ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పింఛన్లు పంపిణీ చేసినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరు నాలుగురోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు.

Samayam Telugu 26 Aug 2020, 3:24 pm
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీస్తోంది. తాజాగా పింఛన్లు పంపిణీ చేసే వ్యక్తి ద్వారా ఒకే గ్రామంలో ఏకంగా 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నంబావి మండలం పెద్దదగడలో పింఛన్లు అందజేసే ఓ వ్యక్తి నుంచి కరోనా వ్యాప్తి జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
coronavirus


ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పింఛన్లు పంపిణీ చేసినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరు నాలుగురోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో కుటుంబంలోని 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సోమవారం గ్రామంలోని 250 మందికి ర్యాపిడ్‌, యాంటిజెన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.