యాప్నగరం

కరోనా కలవరం.. హైదరాబాద్‌లో పెరుగుతున్న అనుమానిత కేసులు

Hyderabad నగరంలోనూ కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 15 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 31 Jan 2020, 11:51 pm
ప్రాణాంతక కరోనా వైరస్‌ హైదరాబాద్ వాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ అనుమానంతో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరంలో ఇప్పటివరకు 15 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరి రక్తనమూనాలను పుణే ల్యాబొరేటరీకి పంపించారు. వీరిలో తొమ్మిది మందికి నెగటివ్ రిపోర్టు రాగా.. మరి కొంత మంది రిపోర్టు అందాల్సి ఉంది.
Samayam Telugu fever1


శుక్రవారం (జనవరి 31) గాంధీ హాస్పిటల్‌లో రెండు, ఫీవర్‌ ఆస్పత్రిలో నాలుగు కరోనా వైరస్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌కు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య కిట్లు ఢిల్లీ నుంచి వచ్చాయి. రెండు రోజుల పాటు నమూనా పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ నిర్ధారణ టెస్టులు చేపట్టనున్నారు.

Also Read: మహిళా పోలీసుల కోసం టాయిలెట్ వాహనాలు

కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించిన లక్షణాలే ఉండటం గమనార్హం. దీంతో సీజనల్ వ్యాధులకు గురైన వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. ఇప్పటివరకు హైదరాబాద్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవలేదని వైద్యులు స్పష్టం చేశారు.

Must Read: తహశీల్దార్‌పై దాడికి యత్నం.. ఎమ్మార్వో ఆఫీస్‌లో వ్యక్తి వీరంగం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.