యాప్నగరం

ఇంటి నుంచి బయటకొస్తే మాస్క్ తప్పనిసరి... తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

కొందరిలో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టులు వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజలను ఆదేశించింది.

Samayam Telugu 10 Apr 2020, 3:45 pm
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కుల కొరత ఉండటంతో.. ఇళ్లలో తయారు చేసిన క్లాత్ మాస్కుల‌ను కూడా వినియోగించొచ్చని తెలిపింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. ఇప్పటి వరకూ వైద్య సిబ్బంది, పోలీసులు, అనారోగ్యంతో ఉన్న వారు మాత్రమే మాస్కులు వాడుతున్నారు. కానీ ఇక నుంచి ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు వాడటాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Samayam Telugu masks


కరోనా బారిన పడిన చాలా మందిలో లక్షణాలేవి కనిపించడం లేదు. వారి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫేస్ మాస్కులను కచ్చితంగా ఉపయోగించాలని సూచించింది. మాస్కులు ధరించడం అంటే మెడకు వేలాడదీసుకోవడం కాదని.. ముక్కు, నోరు, చెంపలు కవర్ అయ్యేలా చూసుకోవాలని తెలిపింది.

ఇప్పటికే ముంబై నగరపాలక సంస్థతోపాటు ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలు బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా ఫేస్ మాస్కులు ధరించాలని ప్రజలను ఆదేశించాయి.

Read Also: మీ ఇంట్లోనే పాత టీ షర్ట్‌తో మాస్క్ తయారు చేస్కోండిలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.