యాప్నగరం

గాంధీ హాస్పిటల్: కరోనా రోగుల బంగారం మాయం

Hyderabad: కరోనా బారినపడి కష్టాల్లో వారుంటే కొంత మంది కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌లో రోగుల వద్ద నుంచి బంగారు ఆభరణాలు కొట్టేశారు.

Samayam Telugu 7 Sep 2020, 8:55 pm
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి బారినపడి కష్టాల్లో వారుంటే.. కొంత మంది కేటుగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను మాయం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో సోమవారం (సెప్టెంబర్ 7) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు రోగుల నుంచి ఆభరణాలు కొట్టేశారు.
Samayam Telugu గాంధీ హాస్పిటల్
Gandhi Hospital


బంగారం కొట్టేసిన విషయాన్ని గుర్తించిన బాధితులు.. వైద్య సిబ్బంది సాయంతో చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిలకలగూడ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం మాయమవుతున్నట్లు సమాచారం.

ఆగస్టులో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కరోనాకు చికిత్స పొందుతున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు మాయం చేశారు.

Also Read: దేవుడా.. ఈగ‌ను చంప‌బోతే ఇల్లు కాలిపోయింది!

Must Read: అంబులెన్స్‌కు దారివ్వని కారు.. రూ.11000 ఫైన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.